బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోస్ట్ క్లైమాక్స్‌కు విజయ్ దర్శకత్వం?

1 రోజు క్రితం

Jana Nayagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 09:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తాజా చిత్రం 'జన నాయకన్' 23న విడుదల కానుంది. కార్తీ ('ఖాకీ') ఫేం హెచ్. వినోథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. తెలుగులో 'ప్రజల నాయకుడు' టైటిల్‌తో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర దర్శకుడు హెచ్. వినోథ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆ వివరాల ప్రకారం, 'జన నాయకన్' పోస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను విజయ్ డైరెక్ట్ చేశారని తెలుస్తోంది. ఈ సీన్‌లో దర్శకులు లోకేశ్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ పాత్రను వరుస ప్రశ్నలు అడుగుతారు. సినిమాకు హైలైట్‌గా నిలిచే సన్నివేశాల్లో ఒకటిగా ఇది ఉంటుందని వినోథ్ తెలిపారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్ర పోషిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్