ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'స్వాగ్‌ ఆఫ్‌ అర్జున` పాట విడుదల

1 రోజు క్రితం

'స్వాగ్‌ ఆఫ్‌ అర్జున` పాట విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 06:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘స్వాగ్‌ ఆఫ్‌ అర్జున’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు బి. అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరపరచడంతోపాటు స్వయంగా ఆలపించారు. ప్రణవ్‌ చాగంటి సాహిత్యం అందించారు. ఎస్‌వీసీసీ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డిసెంబరు 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్