ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘తొలి ప్రేమ కథ’ టీజర్‌ విడుదల

1 రోజు క్రితం

‘తొలి ప్రేమ కథ’ టీజర్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 06:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సాత్విక్‌ వర్మ, అనీ జంటగా నటిస్తున్న చిత్రం ‘తొలి ప్రేమ కథ’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి హీరో ఆకాష్‌ పూరి, దర్శకుడు శైలేష్‌ కొలను అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శైలేష్‌ కొలను మాట్లాడుతూ.. ప్రస్తుత సీజన్‌కు సరిపోయే ఆహ్లాదకరమైన మూడ్‌లో టీజర్‌ ఉందని, సహజత్వంతో సాగే ఇలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని అన్నారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడని, టీజర్‌లో అతని కష్టం కనిపిస్తోందని ప్రశంసించారు. ఆకాష్‌ పూరి కూడా టీజర్‌లోని విజువల్స్‌ను మెచ్చుకుంటూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు, నిర్మాత సాయి లక్ష్మణ్‌ అల్లు మాట్లాడుతూ.. కథ రాసుకున్నప్పుడే సాత్విక్‌, అనీలను పాత్రలకు అనుకున్నానని, తాను ఊహించిన దానికంటే సినిమా బాగా వచ్చిందని తెలిపారు. లిఖిత్‌, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి లక్ష్మణ్‌ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్