‘మాంగళ్యం’ చిత్రంతో గుర్తింపు పొందిన సరోజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఛప్రి’. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, పాటల రచన, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం వంటి బాధ్యతలను కూడా సరోజ్ నిర్వహిస్తున్నారు. బీఎస్‌కే మెయిన్‌స్ట్రీమ్ బ్యానర్‌పై సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సరోజ్ మురికివాడకు చెందిన యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. మురికివాడలో పెరిగిన ఓ యువకుడి ప్రేమ ప్రయాణం, ఆ క్రమంలో సంపన్నులతో ఎదురయ్యే సంఘర్షణలు, వాటి ప్రభావంతో అతడి జీవితంలో చోటుచేసుకునే మార్పుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
‘ఛప్రి’ ఫస్ట్ లుక్ విడుదల
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026, 06:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)