తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'ఈ నగరానికి ఏమైంది` మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'ఇఎన్ఇ రిపీట్` నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సోమవారం 'మిత్వా.. మిత్వా` అంటూ సాగే స్నేహ గీతాన్ని రిలీజ్ చేసింది. ఈ పాటకు సాహిత్యం భరద్వాజ్ అందించగా.. నకుల్ అభ్యంకర్, వీణా ఘంటసాల ఆలపించారు. ఇందులో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్', 'రూట్‌నోడ్ సినిమా' బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డిలు నిర్మిస్తున్నారు.
'మిత్వా .. మిత్వా` పాట విడుదల
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 09, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)