ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, హీరో వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో గ్లింప్స్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ మూవీలో వెంకటేష్‌కు భార్యగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఆమె పాత్ర (స్వర్ణ)కు సంబంధించిన ప్రత్యేక వీడియోను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఆమె భర్త చిట్టిబాబు పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిట్టిబాబు–స్వర్ణల మధ్య ఉండే అనుబంధం, చిలిపి సంభాషణలు, అనురాగం, కుటుంబ విలువలు సినిమాకు మరింత ఆహ్లాదాన్ని అందించనున్నాయని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Print Editionఆదర్శ కుటుంబం నుంచి మరో గ్లింప్స్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)