మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉయ్యాల

54 నిమిషాల క్రితం

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 08:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల

ఉయ్యాల ఊపే ఊపుల

ఉయ్యాల ఊగే వేళ

ఉయ్యాల ఊహల హేళ!


ఉయ్యాల అమ్మ కమ్మని ఒడి

ఊహల ఊసుల బడి

ఉయ్యాల ఊపుల చేతలు

ఉయ్యాల ఊగే పిల్లలకు జోతలు!


ఊహల పల్లకి ఊరేగింది

ఉయ్యాల ఊహల్లో ఊగింది

ఉయ్యాల నవ్వుల్లో మెరిసింది

ఉయ్యాల ఊపుల్లో మురిసింది!


ఊపద్దు ఊపద్దు ఉయ్యాల

ఏ పాప లేకుండా అలా

ఊపద్దు ఊపద్దు తల

ఏమెరుగని చిన్ని పాపలా!


అమ్మ ఒడి ఆనంద డోలిక

అవనిలో మరువలేని వేడుక

పట్టు పాన్పుల తూళిక

పరమాత్మునికైనా మనసు తేలిక!


చెట్టు కొమ్మకు ఉయ్యాల జంపాల

బాలసారల పట్టు చీరల

అట్ల తద్ది అమ్మలక్కల

లోక లోలకం లా ఉయ్యాల!

- పట్లోళ్ళ బక్కారెడ్డి,

97053 15250.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్