బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘దాదా’. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో బాలకృష్ణ కొన్ని పంక్తులు ఆలపించినట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మాస్ సాంగ్ నవంబర్ 13న విడుదల కానుంది. గతంలో బాలకృష్ణ పాడిన ‘మామా ఏక్ పెగ్ లా’ పాట ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్, సముద్రఖని, ఉపేంద్ర లిమాయే, అభిమన్యు సింగ్, మనీష్ వాద్వా, ఆర్. శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
'దాదా`లో పాట పాడిన బాలకృష్ణ
21 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 09:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)