గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం

6 గంటల క్రితం

sekhar master
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 12:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శేఖర్‌ మాస్టర్‌కి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

వివరాల ప్రకారం... హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'కాక' షూటింగ్ జరుగుతోంది. పాట చిత్రీకరణ ముగించుకుని శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో బయలుదేరారు. గురువారం ఉదయం సుమారు 6.00 గంటల సమయంలో ముచ్చింతల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్దకు చేరుకోగానే, ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుండి పండ్ల లోడ్‌తో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు కొంతమేర దెబ్బతింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్