టైమ్ లూప్ జోనర్‌లో తెరకెక్కుతున్న ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ చిత్రం నుంచి ‘ఏదో బాగుందే’ పాటను హీరో శ్రీవిష్ణు తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు ఆయన బెస్ట్ విషెస్ తెలిపారు. యువ కథానాయకుడు అఖిల్ రాజ్, రతిక ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీత దర్శకుడు శశాంక్ తిరుపతి అందించిన ఈ పాట యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. లక్కీ మీడియా, కేడీ అండ్ కో పతాకాలపై ప్రముఖ నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దీవెల శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయితేజ దర్శకత్వం వహిస్తున్నారు.
‘ఏదో బాగుందే’ పాట విడుదల
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)