బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతండ్రీ కొడుకుల భావోద్వేగమే ‘వారణాసి’కి ప్రాణం

17 గంటల క్రితం

తండ్రీకొడుకుల భావోద్వేగమే ‘వారణాసి’కి ప్రాణం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘వారణాసి’. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా గురించి రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బ్రెజిల్‌లో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వారణాసి’ టైమ్‌ ట్రావెల్‌తో పాటు విభిన్న ప్రపంచాల్లో సాగే సాహసయాత్ర అని చెప్పారు. అంటార్కిటికా నుంచి ఆఫ్రికా మీదుగా వారణాసి వరకు కథ ప్రయాణిస్తుందని, వివిధ కాలమానాల్లో భారీ ఆకారాల జీవులు, పురాణాలకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయని తెలిపారు. అయితే, ఈ సాహసయాత్రను ముందుకు నడిపించేది తండ్రీకొడుకుల మధ్య ఉండే ప్రేమ, భావోద్వేగాలేనని రాజమౌళి స్పష్టం చేశారు. సినిమా స్థాయిని మాటల్లో వివరించడం కష్టమని, అందుకే ప్రేక్షకులకు దాని ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు గతేడాది గ్లింప్స్‌ విడుదల చేశామని పేర్కొన్నారు. ఇందులో మహేశ్‌బాబు ‘రుద్ర’గా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడు ‘కుంభ’గా కనిపించనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్