బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసెప్టెంబర్‌ 11న ‘ఎపిక్‌’

5 గంటల క్రితం

epic1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘బేబి’ సినిమాతో హిట్‌ అందుకున్న హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ‘ఎపిక్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా, “అత్యంత అందమైన ప్రయాణాలు ఎప్పుడూ అత్యంత సాధారణమైన క్షణాలతోనే మొదలవుతాయి. ‘ఎపిక్‌ – ఫస్ట్‌ సెమిస్టర్‌’ సెప్టెంబర్‌ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది” అని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజీమ్‌ మహమ్మద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్