‘గూఢచారి’ మూవీతో భారీ హిట్ కొట్టిన హీరో అడవిశేష్ మరోసారి దాని సీక్వెల్ ‘గూఢచారి 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా వామికా గబ్బి నటిస్తున్నారు. కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ, మధు శాలిని, సుప్రియ యార్లగడ్డ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ పలు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానుండడంతో వాయిదా వేశారు. పండుగ హడావిడి తగ్గిన తర్వాత ఫిబ్రవరి 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ‘గూఢచారి 2’
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)