ధర్మవరం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద చేనేత సంఘాల ఆందోళన
ప్రజాశక్తి-ధర్మవరం రూరల్ :అర్హులైన నేతన్నలందరికీ ‘నేతన్న సేవలో’ భాగంగా రూ.25 వేల సాయం అందించాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్‌డిఒ, మున్సిపల్ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘాల జిల్లా నాయకులు జెవి.రమణ, వెంకటనారాయణ, ఎస్‌హెచ్.బాషా జింక చలపతి, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, సిపిఐ నేత ముసుగు మధు, ఆర్ఎస్‌పి నాయకులు మంజుల నరేంద్ర పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ... ధర్మవరం డివిజన్ ప్రాంతంలో అనేక మంది చేనేత కార్మికులు మగ్గం నేస్తున్నా వారికి రూ.25వేల సాయం జమ కాలేదన్నారు. అనేకమంది అర్హులకు జాబితాలో చోటు దక్కలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తించి సాయం అందజేయాలని కోరారు. అనంతరం ఆర్‌డిఒకు, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.








కామెంట్‌లు (0)