ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కల్యాణ్ రామ్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌ విడుదల

1 గంట క్రితం

kalyanram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 11:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నందమూరి కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త భారీ మల్టీస్టారర్ సినిమా నుండి చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. విక్టరీ వెంకటేశ్‌, కల్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న ఈ చిత్ర పోస్టర్‌లో కల్యాణ్ రామ్ పూర్తి సంప్రదాయబద్ధంగా పంచెకట్టులో కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన మొదటి సినిమా 'పటాస్'కు అవకాశమిచ్చి నమ్మిన బెస్ట్ బడ్డీ, తన మొదటి హీరో కల్యాణ్ రామ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో ఆయన్ను సరికొత్త అవతారంలో చూపించబోతున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉందంటూ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్