రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధర్మన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌హాసన్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, సిమ్రాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈ సినిమాలో రజనీకాంత్‌కు అల్లుడి పాత్రలో టాలీవుడ్ హీరో రామ్ నటించనున్నట్లు సమాచారం. తొలుత ఈ పాత్ర కోసం ధృవ్ విక్రమ్‌ను సంప్రదించినట్లు, అనంతరం రామ్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రామ్ నటించనున్నట్లు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు ‘ధర్మన్’లోనూ నటించనున్నట్లు సమాచారం.
మామ అల్లుళ్లుగా ...
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 19, 2026, 09:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)