హర్ష నర్రా, తన్మయి ఖుషి జంటగా సాయిబాబా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మోడ్రన్ మిస్సమ్మ’. లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం, కిట్టు విస్సాప్రగడ సాహిత్యంతో రూపొందిన ఫస్ట్ సింగిల్ ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పెళ్లి వద్దంటూ హీరోయిన్ పాడుకునే ఈ పాటలో హర్ష పంచెకట్టులో, తన్మయి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. సాంగ్ లాంచ్‌లో నిర్మాత కిశోర్ నాయుడు మాట్లాడుతూ సినిమా బాగుందని, భద్రం పాత్ర నవ్వించేలా ఉంటుందని అన్నారు. హర్ష నర్రా మాట్లాడుతూ చిత్రబృందమంతా ఇష్టపడి పనిచేశామని, తన్మయి బాగా నటించిందని, గోపీ సుందర్ సంగీతం, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పారు.
‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదల
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 19, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)