బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'డేవిడ్ రెడ్డి`లో రమ్యకృష్ణ

17 గంటల క్రితం

ramyakrishna.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 09:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో మంచు మనోజ్ నటిస్తోన్న తాజా చిత్రం 'డేవిడ్ రెడ్డి`. ఈ మూవీలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కమలా రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మంగళవారం చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఆమెను చూస్తే 'బాహుబలి` శివగామి పాత్ర తరహాలోనే కమలా రెడ్డి పాత్ర ఉంటుందనే భావన కలుగుతోంది. ఈ చిత్రంలో దర్శకుడు సముద్రఖని కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని దర్శకుడు హనుమా రెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్