‘డీజే టిల్లు’, ‘టిల్లు స్వేర్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న పదో చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. నయన్ సారిక కథానాయికగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రానికి మోహన్ బి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వ బృందంలో కథారచయితగా పనిచేసిన మోహన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తబితా సుకుమార్ సమర్పణలో అన్మోల్ శర్మ, బన్నీ వాస్, అశోక్ బంద్రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవంలో సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. సిద్ధూ జొన్నలగడ్డ, నయన్ సారికపై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
సిద్ధూ జొన్నలగడ్డ 10 చిత్రం ప్రారంభం
22 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 08:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)