శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ పాత్ర చాలా కష్టంగా అనిపించింది

17 గంటల క్రితం

pridhviraj.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో తన పాత్ర, రాజమౌళి మేకింగ్‌ గురించి తాజాగా నిర్వహించిన ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో పృథ్వీరాజ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘కుంభ పాత్ర శారీరకంగా ఎంతో సవాలుతో కూడుకున్నది. నా పాత్రకు శారీరక వైకల్యం ఉంటుంది. చేతులు, కాళ్లు ఒకే పొజిషన్‌లో లాక్‌ అయినట్లు నటించాల్సి వచ్చింది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం శారీరకంగా చాలా కష్టంగా అనిపించింది. అయితే అది నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది.’ అని పృథ్వీరాజ్ చెప్పారు. రాజమౌళి మేకింగ్‌ గురించి మాట్లాడుతూ, భారీ సెట్లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ ఆయన దృష్టి ప్రధానంగా నటుల పర్‌ఫార్మెన్స్, క్లోజప్ షాట్లపైనే ఉంటుందని, నటుల నుంచి అత్యుత్తమ నటనను రాబడతారని అన్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో కలిసి నటించడం గురించి కూడా మాట్లాడారు. ‘మహేష్ తెలుగు చిత్రసీమలో అతిపెద్ద సూపర్‌స్టార్లలో ఒకరు. ప్రియాంక గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన నటి. అయితే రాజమౌళి సెట్‌లో స్టార్‌డమ్ కంటే కథ, పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్