బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'యద్భావం' విడుదల వాయిదా

1 గంట క్రితం

'యద్భావం' విడుదల వాయిదా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 07:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'యద్భావం తద్భవతి' విడుదల వాయిదా పడింది. రమేష్ జక్కల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే అనివార్య కారణాలతో విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అన్నీ కుదిరితే డిసెంబర్ 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించింది. ఇనయ సుల్తానా, రేణుశ్రీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్