మధుమేహం ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన వ్యాధిగా ఉండేదని, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా విస్తరిస్తోందని మెడికవర్ ఆసుపత్రుల కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కె.వంశీకృష్ణ తెలిపారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐసిఎంఆర్–ఇండియాబ్ అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పది మంది పెద్దల్లో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రాబల్యం 9.5 శాతంగా ఉందన్నారు. వ్యవసాయ పనుల్లో యంత్రాల వినియోగం పెరగడం, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల వినియోగం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోనూ మధుమేహం పెరుగుతోందని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ-డయాబెటిస్ కేసులు దాదాపు సమానంగా ఉండటం భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోనూ మధుమేహ బాధితులు పెరిగే అవకాశాన్ని సూచిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోకపోవడంతో వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తున్నారని, కొందరిలో కంటి చూపు, మూత్రపిండాలు, గుండెపై ప్రభావం పడిన తర్వాతే మధుమేహం బయటపడుతోందని తెలిపారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లేదా హెచ్‌బిఎ1సి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కుటుంబంలో ఒకరికి మధుమేహం ఉంటే ఇతర సభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.
వేగంగా విస్తరిస్తున్న మధుమేహం : డాక్టర్ కె.వంశీకృష్ణ
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026, 09:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)