మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మైగ్రైన్ తలనొప్పి తీవ్రత తగ్గాలంటే..?!

6 గంటల క్రితం

migraine
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 05:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మైగ్రేన్ తలనొప్పి చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. ఈ నోప్పిని భరించడం చాలా కష్టం. కానీ దైనందిన అలవాట్ల వల్ల ఈ నొప్పి తీవ్రతను తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

  • సాధారణంగా ఏడెనిమిది గంటలు నిద్రపోతేనే ఆరోగ్యానికి మంచిది. కానీ మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్లు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోవాలని వైద్యులు సూచించారు. అయితే రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొనడం లేదా వారాంతాల్లో ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కూడా ఈ తలనొప్పి విపరీతంగా వస్తుందని న్యూరాలజిస్టులు వెల్లడించారు.

ఉపశమనం పొందడానికి...

చాలామందిలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం, డీహైడ్రేషన్, వాతావరణ మార్పులు, పెర్ఫూమ్స్ వాసన వల్ల, చాక్లెట్, కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల మైగ్రైన్ వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏది తింటే ఈ తలనొప్పి తీవ్రస్థాయిలో ఉంటుందో డైరీలో రాసుకుంటే మంచిది. ఇలా డైరీని మెయిన్టైన్ చేయడం వల్ల అంత తీవ్రస్థాయి నొప్పి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

  • మైగ్రేన్ ప్రారంభ దశలోనే ఉన్నప్పుడే చికిత్స తీసుకోవాలి. ఆలస్యమైతే నొప్పిని నియంత్రించడం కష్టమవుతుంది. పెయిన్ కిల్లర్స్ వాడకం తగ్గించాలి. ఎందుకంటే ఈ మందుల వల్ల క్రమేణా మైగ్రేన్ తలనొప్పి ఎక్కువయ్యే ప్రమాదముంది. తరచూ నొప్పి ఎక్కువగా వస్తుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

  • మైగ్రేన్ తలనొప్పి తీవ్రతను తగ్గించుకోవాలంటే.. క్రమం తప్పకుండా నిద్రపోవాలి. రోజూ శరీరానికి తగినంత నీరు తాగాలి. ఉపవాసం ఉండకుండా సమతుల్య భోజనం చేయాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వైద్యులను సంప్రదించి వారు సూచించిన మందులనే వాడాలి. మీ దినచర్యల్లో ఇవి పాటిస్తే కచ్చితంగా నొప్పి తీవ్రత తగ్గుతుంది అని వైద్యులు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్