శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రహదారుల భద్రతకు మెరుగైన చర్యలు

2 రోజుల క్రితం

uno
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 06:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 2030 నాటికి బాధితుల సంఖ్య 50 శాతం తగ్గాలి

- లక్ష్యాన్ని నిర్దేశించిన యుఎన్‌‌జిఎ

న్యూయార్క్‌ : రహదారుల భద్రతకు మెరుగైన చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలు నివారించి బాధితుల సంఖ్య ప్రస్తుతం నమోదవుతున్న సంఖ్యలో కనీసం సగానికి సగం తగ్గించాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది. 2030లో ఈ లక్ష్యాన్ని సాధించాలని పునరుద్ఘాటించింది. ‘అంతర్జాతీయ రహదారుల భద్రతను మెరుగుపరచడంపై ఉన్నతస్థాయి సమావేశం యొక్క పురోగతి ప్రకటన’ అన్న శీర్షికతో ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ప్రత్యేక ప్రతినిధి (రహదారుల భద్రత) జీన్‌ ‌టోడ్త్‌ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి 162 మంది అనుకూలంగా ఓటు వేశారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను, గాయపడిన వారి సంఖ్యను 2030 కల్లా 50 శాతం తగ్గించాలన్న అంతర్జాతీయ లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానాన్ని ఒకరు వ్యతిరేకించగా, ఎవరూ గైర్హాజరు కాలేదు. అంతర్జాతీయ రహదారుల భద్రతపై యుఎన్‌‌జిఎ చేసిన తీర్మానాలను ఈ సందర్భంగా సమావేశం గుర్తు చేసుకుంది. 2021-2030 కాలాన్ని రహదారుల భద్రతకు రెండవ దశాబ్ద కార్యాచరణగా పేర్కొంటూ 2020 ఆగస్టు 31న ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 2030 కల్లా 50 శాతం మేరా రోడ్డు ప్రమాదాల మృతులను, క్షతగాత్రుల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రహదారుల భద్రతకు సంబంధించి యుఎన్‌ ‌సెక్రటరీ జరల్‌ ‌ప్రత్యేక దూత జేన్‌ ‌టాడ్‌ ‌మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడం మన అత్యవసర కర్తవ్యాల్లో ఒకటని పదేళ్ళ క్రితమే తాను ఈ అసెంబ్లీని హెచ్చరించానని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి మనం బృహత్తరమైన లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నామని అన్నారు. ‘‘తీర్మానాలు ఆమోదించాం, నిబద్ధతలు ప్రకటించాం, డిక్లరేషన్లు కూడా చేశాం, కానీ కార్యాచరణ మాత్రం చాలా పేలవంగా వుంది.’’ అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ఈనాటికీ మరణాల్లో ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలే కావడం ఆందోళనకరమైన అంశమని అన్నారు. గత సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11 లక్షల మందికి పైగా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్