కాంగో రాజధాని కిన్షాసాలోని లింగ్వాలా ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 22 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వివాహ వేడుక జరుగుతున్న ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవనం నుంచి బయటకు వెళ్లేందుకు ఇరుకైన మార్గాలు మాత్రమే ఉండటంతో లోపల ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం తెల్లవారుజాము వరకు మంటలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 22 మంది మృతి చెందినట్లు లింగ్వాలా మేయర్ నార్బర్ట్ ముషింగా వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ షబానీ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
వివాహ వేడుకలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 10:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)