టెహ్రన్ : ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ట్యాంకర్లను అడ్డుకుంటున్న అమెరికా యుద్ధ నౌకలపై ఐఆర్‌జీసీ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. మూడు ట్యాంకర్లు, అమెరికాకు అనుబంధంగా ఉన్న మరో మూడు నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. దాడుల్లో అమెరికా నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అనంతరం అవి హర్మూజ్ జలసంధి నుంచి వెనుదిరిగాయని ఐఆర్‌జీసీ పేర్కొంది. శనివారం హర్మూజ్‌లో ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఈ ప్రతిదాడులు చేపట్టినట్లు తెలిపింది.
మరోవైపు ఇరాన్ దాడుల నుంచి తమ నౌకలు సురక్షితంగా బయటపడ్డాయని అమెరికా ప్రకటించింది. ఈ దాడుల్లో తమ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. తమ నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడితే.. ఆ దేశ నౌకలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా హెచ్చరించింది.
అమెరికా నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 10:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)