సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇమ్రాన్‌ఖాన్ సోద‌రి అలీమా ఖాన్‌ అరెస్ట్

52 నిమిషాల క్రితం

Screenshot from 2026-09-20 21-34-49.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 07:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సోద‌రి అలీమా ఖాన్‌ను లాహోర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం ఆమెను లాహోర్‌లోని కోట్ ల‌ఖ్‌ప‌త్ జైలుకు త‌ర‌లించారు. లాహోర్‌లోని త‌న నివాసం నుంచి అలీమా ఖాన్‌ను స్థానిక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె కారును, డ్రైవ‌ర్‌ను మ‌జాంగ్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అలీమా ఖాన్‌ను సెక్ష‌న్ 3, ఎంపిఓ (మెయింటెనెన్స్ ఆఫ్ ప‌బ్లిక్ ఆర్డ‌ర్‌) కింద పోలీసులు అరెస్టు చేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే అవ‌కాశం ఉన్న‌వారిని ముంద‌స్తుగా ఈ చ‌ట్టం కింద అరెస్టు చేస్తారు. అయితే, ఆమెను అరెస్టు చేయ‌డానికి గ‌ల అసలైన కార‌ణాలు మాత్రం ఇంకా వెల్ల‌డికాలేదు. అలీమా ఖాన్ సోద‌రుడు ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్తుతం పాక్‌లోని రావ‌ల్పిండి జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, పాక్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్‌ను 2022 నుంచి జైలులో ఉంచారు. ఆయ‌న‌కు జైలులో స‌రైన చికిత్స కూడా అంద‌డం లేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇటీవ‌ల కోర్టు ఆర్డ‌ర్ రావ‌డంతో ఇమ్రాన్ ఖాన్‌ను జైలు అధికారులు ఒక రోజు మాత్ర‌మే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ స‌మ‌యంలో ఇమ్రాన్ ఖాన్‌ను అలీమా ఖాన్ క‌లిశారు. ఇది జ‌రిగిన కొద్ది రోజుల‌కే అలీమా ఖాన్‌ను పాక్ పోలీసులు అరెస్టు చేయ‌డం విశేషం. మ‌రోవైపు ఇమ్రాన్ ఖాన్‌కు రావ‌ల్పిండిలోని అడియాలా జైలులో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (పిమ్స్)కు చెందిన వైద్య బృందం ఈ పరీక్ష‌లు ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య స్థితికి సంబంధించిన స‌మాచారం తెలియాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్