ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కల్తీ మద్యంతో మధ్యప్రదేశ్‌లో తొమ్మిది మంది మృతి

1 గంట క్రితం

spurious liquor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 11:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో కల్తీ మద్యం సేవించి తొమ్మిది మంది మరణించగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని బండా తహసీల్‌ పరిధిలోని రెండు గ్రామాల్లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాల్లో కొందరు వ్యక్తులు శనివారం రాత్రి అక్రమంగా విక్రయించిన కల్తీ మద్యం సేవించినట్లు అధికారులు తెలిపారు. తలనొప్పి, వాంతులతో అస్వస్థతకు గురైన పలువురిని బుందేల్‌ఖండ్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు తరలించినట్లు సాగర్‌ కలెక్టర్‌ ప్రతిభా పాల్‌ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఒక వ్యక్తి మరణించారని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


అక్రమంగా విక్రయించిన కల్తీ మద్యం కారణంగానే మరణాలు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని కలెక్టర్‌ తెలిపారు. రెండు గ్రామాల్లో వైద్య బృందాలతో ఆరోగ్య తనిఖీలు ప్రారంభించినట్లు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్