లండన్ : ఆర్థిక నేరారోపణలతో బ్రిటన్‌కు పరారైన ఐపిఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ బ్రిటీష్ పౌరసత్వం పొందినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆధివారం సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. ఇకపై తాను భారత పౌరుడిని కాదని, శేష జీవితమంతా బ్రిటన్ పౌరుడిగానే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పౌరసత్వం అందుకున్నానని, ఇది తన జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఐపిఎల్ టోర్నమెంట్ నిర్వహణ సమయంలో ఆర్థిక లావాదేవీలు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోడీ, రహస్యంగా 2010లో భారత్‌ను వీడి బ్రిటన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆయన లండన్‌లోనే నివసిస్తూ భారత దర్యాప్తు సంస్థల విచారణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బ్రిటీష్ పౌరసత్వం లభించడం చర్చనీయాంశమైంది. 16 ఏళ్లుగా కేసుల విచారణను తప్పించుకు తిరుగుతున్న లలిత్ మోడీకి భారత దర్యాప్తు సంస్థలకు సహకరించే ఉద్దేశం లేదన్న విషయం స్పష్టమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
లలిత్ మోడీకి బ్రిటీష్ పౌరసత్వం
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)