సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎర్ర సముద్రంలో మళ్లీ ఉద్రిక్తత

1 గంట క్రితం

strike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 09:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సౌదీ చమురు కేంద్రాలపై హౌతీల దాడులు

- పెరిగిన చమురు ధరలు

సింగపూర్: ఎర్ర సముద్ర ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని కీలక చమురు కేంద్రాలపై దాడులు జరపడంతో అంతర్జాతీయ సముద్ర రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ప్రముఖ షిప్పింగ్ డేటా సంస్థ కెప్లర్ వెల్లడించిన వివరాల ప్రకారం, బాబ్ అల్ మందెబ్ జలసంధి గుండా ఆదివారం కేవలం 11 చమురు ట్యాంకర్లు మాత్రమే ప్రయాణించాయి. గత కొన్ని నెలల్లో ఇదే అత్యల్ప సంఖ్యగా నమోదైంది. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు కూడా మందగించాయి. శనివారం జిజాన్, యాన్బు నగరాల్లోని సౌదీ అరామ్కో చమురు కేంద్రాలపై దాడులు నిర్వహించినట్లు హౌతీల సైనిక ప్రతినిధి ప్రకటించారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకోవడంతో మధ్యప్రాచ్యం, యూరప్, ఆఫ్రికా మార్కెట్లలో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి.

ఆదివారం బాబ్ అల్ మందెబ్ మార్గం గుండా ప్రయాణించిన ఏడు చమురు ట్యాంకర్లలో మూడు ఎర్ర సముద్రంలోకి ప్రవేశించాయి. వీటిలో రెండు సౌదీ ముడి చమురును లోడ్ చేసుకునేందుకు యాన్బు పోర్టుకు వెళ్తున్న సూపర్‌ట్యాంకర్లు కాగా, మరో నౌక రష్యాతో సంబంధం ఉన్నదిగా సమాచారం. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చైనా, పాకిస్తాన్ వంటి దేశాలకు ముడి చమురు సరఫరా చేసే నౌకలు ఎర్ర సముద్ర మార్గంలోనే ప్రయాణిస్తున్నాయి.

అమెరికా–ఇరాన్ మధ్య ప్రత్యక్ష దాడుల్లో తాత్కాలిక ఉపశమనం కనిపించినప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ మార్గం గుండా ప్రతిరోజూ పది కంటే తక్కువ చమురు నౌకలే ప్రయాణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్