సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎట్టకేలకు గొల్లగూడెంకు చేరిన తాడిపూడి కాలువ నీరు

1 గంట క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 08:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఉంగుటూరు (ఏలూరు జిల్లా) : తాడిపూడి ఎత్తిపోతల పథకం నుండి సాగునీరు ఎట్టకేలకు ఉంగుటూరు మండలం గొల్లగూడెం సోమవారం చేరుకుంది. ఈ కాల్వ కింద గొల్లగూడెం, కొత్తగూడెం, కంసాలిగుంట , ఏ గోకవరం తదితర గ్రామాల్లో రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు సోమవారం ప్రజాశక్తిలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కాలువలో అడ్డంకులు, మట్టి దిబ్బలను జెసిబి లతో తొలగించి నీటి ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి ఉంగుటూరు తహశీల్దారు సన్యాసిరావు సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ నీటిని తీసుకురావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్