మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా యూఏఈ అగ్రస్థానం

35 నిమిషాల క్రితం

ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా యూఏఈ అగ్రస్థానం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 09:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

షార్జా: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రముఖ అమెరికన్ పరిశోధనా సంస్థ 'గాలప్' (Gallup) విడుదల చేసిన '2026 గ్లోబల్ సేఫ్టీ రిపోర్ట్'లో యూఏఈ ఈ ఘనత సాధించింది. మీరు నివసించే ప్రాంతంలో రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితమని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు యూఏఈలోని 96 శాతం మంది ప్రజలు "అవును" అని సమాధానమిచ్చారు.


సింగపూర్ కూడా 96 శాతం స్కోరుతో యూఏఈతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచింది. అయితే, గణాంకాల పరంగా యూఏఈనే అగ్రస్థానంలో ఉందని గాలప్ తన నివేదికలో స్పష్టం చేసింది. 2020 తర్వాత యూఏఈ ఈ జాబితాలో మళ్లీ నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. 2006లో గాలప్ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుండి 12 సార్లు సింగపూర్ అగ్రస్థానంలో కొనసాగింది. ఆ ఆధిపత్యానికి తెరదించుతూ ఈసారి యూఏఈ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.


ప్రపంచవ్యాప్తంగా తగ్గిన భద్రతా భావన.. గల్ఫ్ దేశాల హవా:

అంతర్జాతీయ స్థాయిలో చూస్తే, 2024లో 73 శాతం మంది రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితమని పేర్కొనగా, 2025 నాటికి ఆ సంఖ్య 69 శాతానికి పడిపోయింది. అయితే, గల్ఫ్ దేశాలు మాత్రం భద్రత విషయంలో తమ సత్తా చాటాయి. ప్రపంచంలోని టాప్-10 అత్యంత సురక్షిత దేశాల జాబితాలో 4 గల్ఫ్ దేశాలు చోటు దక్కించుకోవడం విశేషం.


గల్ఫ్ దేశాల స్కోర్లు ఇవే:

* యూఏఈ: 96 శాతం

* సౌదీ అరేబియా: 95 శాతం

* కువైట్: 93 శాతం

* బహ్రెయిన్: 92 శాతం


మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్), ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో అత్యంత సురక్షితమైన దేశంగా కూడా యూఏఈ నిలిచింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో 15 ఏళ్లు పైబడిన 1,43,620 మంది అభిప్రాయాలను సేకరించి గాలప్ ఈ సర్వే నిర్వహించింది. యూఏఈ, సౌదీ, కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ప్రతి 10 మందిలో 9 మంది ఇప్పటికీ రాత్రిపూట ఒంటరిగా నడవడం పూర్తిగా సురక్షితమని స్పష్టం చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్