మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నా రూపురేఖలపై అనవసర వ్యాఖ్యలు : డెన్మార్క్ ప్రధాని తీవ్ర అసహనం

1 గంట క్రితం

Unnecessary comments on my appearance: Danish PM expresses strong displeasure.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 10:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

డెన్మార్క్ : తన రూపురేఖలపై అనవసర వ్యాఖ్యలు, సలహాలు చేస్తున్న వారిపై డెన్మార్క్‌ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడరిక్సన్‌ (48) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఘాటుగా స్పందించారు. ఇటీవల ఉక్రెయిన్‌ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం .... తన ముక్కుపై ఉన్న పులిపిరికాయను తొలగిస్తానంటూ ఓ ప్లాస్టిక్‌ సర్జన్‌ సందేశం పంపారని ఆమె తెలిపారు. గత కొన్నేళ్లుగా తన అందానికి సంబంధించిన ఇలాంటి సందేశాలు, వ్యాఖ్యలు ఎన్నో ఎదుర్కొన్నానని చెప్పారు. తన దంతాలు బాగోలేవని, జుట్టు పలుచగా ఉందని, ముక్కుపై ఉన్న పులిపిరి అసహ్యంగా ఉందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారని ఫ్రెడరిక్సన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ... 50 ఏళ్ల వయసుకు చేరువవుతున్న తనకు తన శరీరం, తన రూపం పట్ల పూర్తి సంతృప్తి ఉందని స్పష్టం చేశారు. తన రూపురేఖలను మార్చుకోవాలంటూ పురుష ప్లాస్టిక్‌ సర్జన్‌లు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇతరులు ఎలా కనిపిస్తారన్న విషయం తనకు అనవసరమని పేర్కొన్న ఆమె ... తన గురించి రాయాలనుకునేవారు రూపం గురించి కాకుండా మరింత అర్థవంతమైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా తన ముక్కు గురించి కాకుండా సమాజానికి ఉపయోగపడే విషయాలపై సమయాన్ని వెచ్చించాలని కోరారు. ఇలాంటి సౌందర్య సలహాలు తనకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్