శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అల్బేనియాలో పార్లమెంటును ముట్టడించిన యువత

1 గంట క్రితం

అల్బేనియాలో పార్లమెంటును ముట్టడించిన యువత
- ఉద్ధృతంగా ‘ఫ్లెమింగో విప్లవం’ 
- వేలాది మంది అరెస్టు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 12:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉద్ధృతంగా ‘ఫ్లెమింగో విప్లవం’

- వేలాది మంది అరెస్టు​

టిరానా: అల్బేనియాలో ‘ఫ్లెమింగో విప్లవం’గా పిలుస్తున్న ప్రజా ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులు పార్లమెంటును ముట్టడించారు. పోలీసులు ఆందోళనకారులను అణిచేయడానికి బాష్పవాయవు గోళాలు, వాటర్‌ ‌కెనన్లు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ప్రభుత్వ భవనాలను ధ్వంసం అయ్యాయి. వీధుల్లో మంటలు చెలరేగాయి. రాజధాని టిరానాతో పాటు ఇతర నగరాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా వేలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

అవినీతిపై యువత ఆగ్రహం..

​ అవినీతి, విద్యకు అయ్యే అధిక వ్యయం వంటి సమస్యలపై యువత ఆగ్రహించింది. ప్రధాని ఎడి రామా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే, యువత డిమాండ్‌‌ను ప్రధాని ఎడి రామా తిరస్కరించారు. అంతేకాకుండా, సోంత దేశ యువతను విదేశీ శక్తుల ఏజెంట్లు అంటూ విమర్శించారు. ఈ ఉద్యమం వెనుక విదేశీ జోక్యం ఉందని ఆయన ఆరోపించారు. పదవి నుండి తప్పుకునే ప్రసక్తి లేదని ప్రధాని తేల్చి చెప్పారు. దీంతో ప్రజాగ్రహం దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే, ​ఫ్లెమింగో పక్షుల ఆవాస ప్రాంతాల సమీపంలో నిర్మించతలపెట్టిన ఒక విలాసవంతమైన రిసార్ట్ ప్రాజెక్టుపై పర్యావరణ వ్యతిరేకతతో ఈ ఉద్యమం మొదలైంది. ఈ ప్రాజెక్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్‌కు చెందినది కావడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్