వాషింగ్టన్ : ఇరాన్ బెదిరింపుల కారణంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటో సదస్సు నుండి రహస్యంగా వెళ్లిపోయారని నివేదిక పేర్కొంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్‌లో సోమవారం ఒక కథనం ప్రచురితమైంది. గత నెల టర్కీలోని అంకారాలో నిర్వహిస్తున్న నాటో సదస్సు నుండి ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ప్రయాణిస్తున్నట్లు వైట్‌హౌస్ చిత్రీకరించినప్పటికీ.. ఆయన ప్రత్యామ్నాయ సైనిక విమానంలో వెళ్లినట్లు నివేదిక తెలిపింది. ఇరాన్ బెదిరింపుల కారణంగానే ట్రంప్ ఈ చర్య తీసుకున్నట్లు కథనంలో పేర్కొంది. నాటో దేశాల నేతల వార్షిక సమావేశం ముగించుకుని వాషింగ్టన్‌కు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించినపుడు, తాము ట్రంప్‌తో పాటు ఒకే విమానంలో ఉన్నామని భావించేలా జర్నలిస్టులు, కొంతమంది వైట్‌హౌస్ సిబ్బందిని నమ్మించడం ద్వారా ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లు తెలిపింది. వారాపత్రికల్లోని సమాచారం, ఆ కార్యకలాపాలపై అవగాహన ఉన్న ఒక అమెరికా అధికారి , ట్రంప్ పర్యటన గురించి తెలిసిన మరొక వ్యక్తిని వాషింగ్టన్ పోస్ట్ ఈ కథనంలో ఉటంకించింది. అసోసియేటెడ్ ప్రెస్ ఈ నివేదికను నిర్థారించాల్సి వుంది.
ఇరాన్ బెదిరింపులతోనే నాటో సదస్సు నుండి వెళ్లిపోయిన ట్రంప్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 06:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)