బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జంతర్ మంతర్ వద్ద నిరసనకారుల నిర్బంధంపై ఐరాస ఆందోళన

3 రోజుల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 11:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలి

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన వారిని పెద్ద సంఖ్యలో నిర్బంధించడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనలో సీపీఐ(ఎం) నాయకులు, సీజేపీ కార్యకర్తలు సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం కోరింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి తమీన్ అల్‌-ఖైతాన్ ప్రకటన విడుదల చేశారు. నిరసనకారులను నిర్బంధించడం సరైన చర్య కాదని పేర్కొంటూ, వారిని విడుదల చేసేందుకు భారత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఐక్యరాజ్యసమితి ప్రకటనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపైనా ఐక్యరాజ్యసమితి సమానంగా స్పందించాలని భారత్ కోరింది. ఈ నిరసన సందర్భంగా ఢిల్లీ పోలీసులు సీపీఐ(ఎం) నాయకులు, సీజేపీ కార్యకర్తలు, జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్