మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపూరీలు ఎక్కువసేపు ఉబ్బి ఉండాలంటే..

1 గంట క్రితం

puri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 05:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంట్లో పూరీలు చేసినప్పుడు కళాయిలో బాగా ఉబ్బినా, ప్లేట్‌లోకి తీసిన కొద్దిసేపటికే మెత్తబడి అణిగిపోతుంటాయి. అలాకాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

  • పూరీలు బాగా రావాలంటే పిండి కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఉండాలి. అలా చేస్తే పూరీలు నూనెను తక్కువగా పీల్చుకుని ఎక్కువసేపు ఉబ్బి ఉంటాయి.

  • గోధుమపిండిలో ఓ రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వ కలిపినా పూరీలు త్వరగా అణిగిపోకుండా ఉంటాయి.

  • పిండిలో ఒక స్పూన్ వేడి నూనె కలిపినా పూరీలు ఎక్కువసేపు పొంగి ఉంటాయి.

  • పిండి కలిపిన వెంటనే కాకుండా 15 నుంచి 20 నిమిషాలు మూతపెట్టి ఉంచిన తర్వాత పూరీలు ఒత్తుకోవాలి.

  • పూరీలను ఒకే పరిమాణంలో, ఒకే మందంతో ఒత్తుకోవాలి. నూనె వేడి సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. నూనె చల్లగా ఉంటే పూరీలు ఎక్కువ నూనె పీల్చుకుని మెత్తబడిపోతాయి. మరీ ఎక్కువ వేడిగా ఉంటే బయట మాత్రమే కాలిపోతాయి, లోపల సరిగా ఉడకవు. కాబట్టి పూరీని నూనెలో వేసిన వెంటనే అది నెమ్మదిగా పైకి తేలుతూ ఉబ్బడం ప్రారంభించేలా నూనె వేడి ఉండాలి.

  • పూరీలను ఒకదానిపై ఒకటి పేర్చకుండా, నూనె పూర్తిగా వడకట్టిన తర్వాత మాత్రమే ప్లేట్‌లో పెట్టుకోవాలి. అవసరమైతే టిష్యూ పేపర్‌పై కాసేపు ఉంచి తరువాత సర్వ్ చేయవచ్చు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్