గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మిక్సీ జార్‌ మూత ఇలా టైట్‌ చేయండి..

3 గంటల క్రితం

mixijar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మిక్సర్ గ్రైండర్ (మిక్సీ) ఒకటి. మసాలాలు నూరాలన్నా, చట్నీలు చేయాలన్నా, జ్యూస్‌లు పట్టుకోవాలన్నా మిక్సీ ఉండాల్సిందే. అయితే, తరచూ మిక్సీ జార్ మూత లూజ్ అయిపోతుంటుంది. దీంతో మిక్సీ ఆన్ చేయగానే లోపల ఉన్న పదార్థాలు బయటకు చిమ్మి ఇల్లంతా గందరగోళం అవుతుంది. అలాంటప్పుడు మిక్సీ తిప్పినంతసేపూ మూతను చేత్తో గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా, మూతను ఇలా టైట్ చేసుకోవచ్చు.

  • మిక్సీ జార్ మూత లూజ్ అవ్వడానికి ప్రధాన కారణం దానికి ఉండే రబ్బర్ గ్యాస్కెట్ (రబ్బర్ రింగ్) సాగిపోవడమే. దీన్ని ఫిక్స్ చేయడానికి ముందుగా మూతకున్న రబ్బర్‌ను విడిగా తీసి, బాగా మరుగుతున్న వేడి నీళ్లలో కాసేపు వేయాలి. ఆ వెంటనే దానిని తీసి, ఐస్ ముక్కలు ఉన్న చల్లటి నీళ్లలో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచాలి. ఉష్ణోగ్రతలో వచ్చే ఈ హఠాత్తు మార్పు వల్ల సాగిపోయిన రబ్బర్ తిరిగి ముడుచుకుని తన పాత సైజుకు వచ్చేస్తుంది. దీంతో మూత జార్‌కు పక్కాగా ఫిట్ అవుతుంది.

  • మిక్సీ జార్ పైభాగంలో (మూత పెట్టే చోట) ఒకటి లేదా రెండు లావుపాటి రబ్బర్ బ్యాండ్‌లను గట్టిగా చుట్టేయాలి. ఆ తర్వాత మూత పెట్టాలి. ఈ రబ్బర్ బ్యాండ్‌లు అదనపు గ్రిప్‌ను ఇస్తాయి. దీనివల్ల మిక్సీ ఎంత స్పీడ్‌గా తిరిగినా మూత అస్సలు కదలదు. సమయం తక్కువగా ఉండి అర్జంట్‌గా మిక్సీ పట్టుకోవాల్సిన సమయంలో ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది.

  • జార్ మూతకున్న రబ్బర్ రింగ్‌ను బయటకు తీయాలి. ఇప్పుడు ఆ మూతకు రబ్బర్ కూర్చునే గాడిలో లావుపాటి కాటన్ దారం లేదా సెల్లో టేప్‌ను రెండు మూడు రౌండ్లు చుట్టాలి. ఆ తర్వాత దానిపై మళ్లీ రబ్బర్ రింగ్‌ను ఎప్పటిలాగే ఫిట్ చేయాలి. ఇలా చేయడం వల్ల రబ్బర్ కొద్దిగా బయటకు వచ్చి జార్‌పై మూత చాలా గట్టిగా, గ్రిప్‌గా కూర్చుంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్