బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపుట్టగొడుగులను ఇలా నిల్వ చేసుకోవచ్చు..

1 గంట క్రితం

bit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 05:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే పుట్టగొడుగులు ప్రస్తుతం మార్కెట్‌లో సులభంగా దొరుకుతున్నాయి. అయితే, పుట్టగొడుగులు కొనుగోలు చేసిన కొద్ది రోజులకే జిగటగా మారిపోవడం, రంగు మారడం లేదా పాడైపోతుంటాయి. వీటిలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. సరైన పద్ధతుల్లో శుభ్రం చేయడం, నిల్వ చేయడం ద్వారా పుట్టగొడుగులను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.

పుట్టగొడుగులను కొనేప్పుడే గట్టిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి. మెత్తబడిన, నల్లటి మచ్చలు ఉన్న వాటిని కొనకూడదు. చాలామంది పుట్టగొడుగులు నీటిని పీల్చుకుంటాయని అసలు కడగడమే మానేస్తారు. కానీ అవి మట్టి లేదా కంపోస్ట్‌లో పెరుగుతాయి కాబట్టి శుభ్రం చేయడం చాలా ముఖ్యం. నీటిలో ఎక్కువసేపు నానబెట్టకుండా, పారుతున్న నీటి కింద త్వరగా కడిగి, వెంటనే టిష్యూ పేపర్‌తో తడి లేకుండా తుడిచేయాలి. లేదా పొడి పేపర్ టవల్‌ లేదా చిన్న బ్రష్‌తో వాటిపై ఉన్న మట్టిని సున్నితంగా తొలగించాలి.

ఈ పొరపాటు అస్సలు చేయవద్దు

పుట్టగొడుగులను ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి ముందు అస్సలు కడగకూడదు. వండే సమయానికి మాత్రమే వాటిని శుభ్రం చేయాలి. ముందే కడిగి ఫ్రిజ్‌లో పెడితే, అవి స్పాంజిలా నీటిని పీల్చుకుని త్వరగా కుళ్లిపోతాయి. అలాగే నిల్వ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కవర్లను వాడకూడదు. ప్లాస్టిక్ వల్ల లోపల తేమ పెరిగి బూజు పట్టడానికి దారితీస్తుంది. దానికి బదులుగా బ్రౌన్ పేపర్ బ్యాగ్‌ (కాగితపు సంచి) లేదా పొడి గుడ్డ సంచిలో వదులుగా ఉంచి నిల్వ చేయాలి. ఇది అదనపు తేమను పీల్చుకుని అవి పాడవకుండా చూస్తుంది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచనలు

పుట్టగొడుగులను వారం కంటే ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే, ముందుగా వాటిని కొద్దిగా వేడినీటిలో ముంచి తీసి లేదా కొద్దిగా ఉడికించి ఆరబెట్టి, ఆ తర్వాత గాలి చొరబడని ఫ్రీజర్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు వీటిని నేరుగా సూప్‌లు, గ్రేవీలు లేదా సలాడ్‌లలో వాడుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మార్గదర్శకాల ప్రకారం, పుట్టగొడుగులను రిఫ్రిజిరేటర్ ప్రధాన భాగంలో 2°C నుంచి 5°C ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. తేమ ఎక్కువగా ఉండే వెజిటబుల్ డ్రాయర్‌లో పెట్టకుండా, రంధ్రాలున్న పేపర్ బ్యాగ్‌లోనే గాలి ధారాళంగా ప్రసరించేలా వదులుగా అమర్చడం సురక్షితం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్