కోల్‌కతా : మమతా బెనర్జీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం టిఎంసికి చెందిన ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా అదేబాటలో ఆ పార్టీ అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య కూడా శనివారం రాజీనామా చేశారు. ఆ పార్టీకి చెందిన అన్ని పదవులకూ ఆమె రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. అలాగే టిఎంసికి చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన బాద్యతల నుంచి కూడా ఆమె తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై పార్టీకి సంబంధించిన అంశాల్లో తన పేరును ప్రస్తావించకూడదని, మమత తరఫున తనను సంప్రదించకూడదని కూడా చంద్రిమ ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే మమతకి ఎంతో సన్నిహితంగా ఉండే ఈమె తన రాజీనామాకు గల కారణమేంటో వెల్లడించకపోవడం గమనార్హం.








కామెంట్‌లు (0)