శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అనిల్‌ రావిపూడి సినిమాలో శ్రీమాన్‌

1 గంట క్రితం

sriman
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ తమిళ నటుడు శ్రీమాన్ తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ అవకాశంపై ఆనందం వ్యక్తం చేసిన శ్రీమాన్, అనిల్ రావిపూడికి కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో అనిల్ రావిపూడితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోను పంచుకున్న శ్రీమాన్, 'నా మాతృభాష తెలుగులో తొలిసారి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్