శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ టీజర్‌ విడుదల

1 గంట క్రితం

teaser
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 08:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కన్నడ స్టార్ హీరో డాక్టర్ శివరాజ్‌కుమార్, డాక్టర్ ధనంజయ (దాళి) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం '666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'. హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో 1970ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను హీరో నాని తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. 'నాన్న ప్రతి కథకు ఒక హీరో కావాలని చెప్పాడు' అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌లో శివరాజ్‌కుమార్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రంగా ఇది ఉండబోతున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అదితి బాలన్, ప్రియాంక అరుళ్ మోహన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. వైశాఖ్ జె. ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ వైశాఖ్ జె. గౌడ నిర్మిస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్