జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కించిన ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తాజాగా విడుదల చేశారు. పాటను విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఎస్. సుహాస్ బాణీ, జగదీష్ సాహిత్యంతో రూపొందిన ఈ పాటకు చైతన్య, లాస్య గాత్రం అందించారు. లిరికల్ వీడియోలో హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తోంది. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వర్షిక పాశం హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.
‘తిడుతున్నా కొడుతున్నా’ పాట విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 08:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)