శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి

1 గంట క్రితం

fishers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 08:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

: వృత్తి, ఉపాధి, సామాజిక భద్రత కల్పించాలి

సోంపేట: మత్స్యకారుల సమస్యల పరిష్కారం, వృత్తి–ఉపాధి, సామాజిక భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పలు తీర్మానాలు చేశారు. ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని, మత్స్యకార కుటుంబాలకు 75 శాతం సబ్సిడీతో పడవలు, వలలు, ఇంజన్లు తదితర పరికరాలు అందించాలని, డీజిల్ సబ్సిడీని రూ.40కి, వేట నిషేధ భృతిని రూ.40 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సముద్ర ప్రమాదాల్లో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, మత్స్యకారుల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. బ్లూ ఎకానమీ పేరుతో తీర ప్రాంతాన్ని, మత్స్యసంపదను దెబ్బతీసే రేర్ ఎర్త్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ, 2022 ఓఏఎండీఆర్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో తీర ప్రాంత సమస్యలపై అధ్యయనం, అక్టోబర్ 5న ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్‌కు వినతి, నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఆందోళనలు, డిసెంబర్‌లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రతినిధులను సిద్ధం చేయాలని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్