దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. తాజాగా ఈ చిత్రంలోని ప్రతినాయకుడు శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. ఈ పాత్రను పరిచయం చేస్తూ చిత్రయూనిట్ తాజాగా మూడు నిమిషాల నిడివిగల వీడియోను రిలీజ్ చేసింది. ‘ఇది ధర్మమా.. అధర్మమా’ అంటూ సాగే డైలాగ్‌తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. చివరిలో మహాకాళిగా శ్రీయారెడ్డి పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు.
శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 07:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)