సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రవితేజ, విష్ణు మల్టీస్టారర్‌

1 గంట క్రితం

ravi teja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 07:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటుడు రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం థియేటర్లలో విడుదలై హిట్‌ టాక్‌ అందుకుంది. ఈ ఉత్సాహంతోనే ఆయన వరుస సినిమాల్లో నటించేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. రవితేజ, హీరో విష్ణు నటిస్తోన్న మల్టీస్టారర్‌ మూవీకి ‘వీరాధి వీరులు కేరాఫ్ మహిళా మండలి’ అనే డిఫరెంట్‌ టైటిల్‌ను చిత్రయూనిట్‌ ఖరారు చేసింది. ఈ మూవీ షూటింగ్‌ ఆగస్టు చివరి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హాసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్