- 23.24 శాతమే పూర్తయిన పరిశీలన..
- క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారంలోనూ జాప్యం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో క్షేత్రస్థాయి విచారణలు నత్తనడకన సాగుతున్నాయి. నోటీసులు జారీ చేసి దాదాపు 95 శాతం ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ, వాటిపై చేపట్టాల్సిన విచారణల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఈనెల 24 నాటి అధికారిక గణాంకాల ప్రకారం పంపిణీ చేసిన 42.33 లక్షల నోటీసుల్లో కేవలం 9.83 లక్షలపై విచారణ పూర్తయింది. అంటే 23.24 శాతం విచారణలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 76 శాతానికి నోటీసులపై విచారణ జరగాల్సి ఉంది.విచారణల ప్రక్రియలో జిల్లాల మధ్య గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలు కొంత మెరుగైన స్థితిలో ఉండగా, పలు జిల్లాల్లో విచారణలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. నోటీసులు జారీ చేసిన అనంతరం వాటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హత, అనర్హతలను నిర్ధారించాల్సి ఉండగా.. ఆ ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది.
క్లెయిములు.. అభ్యంతరాల పరిష్కారంలోనూ జాప్యం
ఓటర్ల నుంచి వచ్చిన క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారంలోనూ పెండింగ్ గణనీయంగా ఉంది. ఫారం 6కు సంబంధించిన సుమారు 2.50 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫారం7కు సంబంధించి 5,385, ఫారం8కు సంబంధించి 1.49 లక్షల దరఖాస్తులు పరిష్కారం కావాల్సి ఉంది.







కామెంట్‌లు (0)