సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతు ఉద్యమానికి మల్లారెడ్డి మరణం తీరనిలోటు

1 గంట క్రితం

mallareddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రైతుసంఘం, ఐద్వా, కెవిపిఎస్‌, ఎపి కౌలు రైతుల సంఘం, వికెఎస్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతు, వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటని వివిధ సంఘాలనాయకులు తెలిపారు. వ్యవసాయ రంగంపై అపారమైన అవగాహన కలిగిన ఆయన రైతు ఉద్యమానికి ఎనలేని సేవలందించారని రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి క్రిష్ణయ్య,కె ప్రభాకరరెడ్డి, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీదేవి, వి సావిత్రి, కెవిపిఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి, ఎపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి బలరాం, ఎం హరిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి రమాదేవి, కె లోకనాదం సోమవారం ఒక ప్రకటనలో మల్లారెడ్డి మృతికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు మల్లారెడ్డి తుదిశ్వాస విడిచారని తెలిపారు. సాగునీటి రంగ సమస్యలు, రైతాంగ ఉద్యమాలపై అనేక రచనలు చేశారని తెలిపారు.విత్తన రంగంపై బహుళజాతి సంస్థల పెత్తనానికి, బిటి పత్తిపై మాన్‌శాంటో కంపెనీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సిపిఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా విశేష సేవలందించారని తెలిపారు. రైతాంగం, కష్టజీవులు, పేదల అభివృద్ధికి జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. మరణానంతరం తన భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కళాశాల విద్యార్థుల పరిశోధనకు దానం చేయడం ద్వారా మల్లారెడ్డి తన సేవా స్ఫూర్తిని చాటుకున్నారని తెలిపారు.తాను ఉద్యమాలకు అంకితమవ్వడమే కాక, తన బిడ్డలను సైతం ఉద్యమ నేతలుగా తీర్చిదిద్దిన ఆయన జీవితం మహోన్నతమైనదని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్