హీరో నాని సమర్పణలో, నితీన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి షాట్‌కు నాని క్లాప్ కొట్టగా, ఈ సందర్భంగా చిత్రబృందం టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేసింది. అనంతరం నాని సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘‘ప్రేమకథలు ఎప్పుడూ ప్రత్యేకమే. దానికి వినూత్నమైన నేపథ్యం, అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం తోడైతే మరింత అందంగా మారుతుంది. నితీన్‌తో కలిసి అందరినీ ప్రేమలో పడేలా చేసే ఓ అందమైన సినిమాను రూపొందిస్తున్నాం. ఈ ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని ట్వీట్ చేశారు. మురళీధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దీప్తి గంటా నిర్మిస్తున్నారు.
‘అలియాస్ రుక్మిణీ’ ప్రారంభం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 10:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)