సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కావేరీ వివాదంలో సుప్రీంకు తమిళనాడు సర్కార్‌

2 గంటల క్రితం

supreme-court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:48 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిడబ్ల్యుఎంఎ ఆదేశాల అమలుకు అభ్యర్ధన

చెన్నై : కావేరీ జల వివాదంలో తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయిం చింది. కబిని, కృష్ణరాజ సాగర రిజర్వాయర్ల నుండి రోజుకు 3500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని జులై 30న సెంట్రల్‌ ‌వాటర్‌ ‌మేనేజ్‌‌మెంట్‌ ‌అథారిటీ (సిడబ్ల్యు ఎంఎ) తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ విజయ్‌ ‌ప్రభుత్వం సుప్రీంను కోరింది. ఆగస్టు 12 లోపుగా మొత్తంగా 4.536 టిఎంసిల నీటిని విడుదల చేయాలని తమిళనాడు కోరుతోంది. కాగా మరోవైపు నీటి పరిస్థితి కాస్తంత మెరుగయిందని కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ ‌వ్యాఖ్యానిం చారు. ఆగస్టు 13న రాష్ట్రవ్యాప్త బంద్‌‌ ప్రణాళికను ఉపసంహరించుకోవాలని కన్నడ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దు కేంద్రం బిల్లిగుండులు వద్ద జూన్‌ 1‌నుండి ఆగస్టు 12 వరకు మధ్య కాలంలో తగ్గిన నీటి కొరతను ‘ప్రో రాటా ప్రాతిపదికన భర్తీ చేసేందుకు కర్ణాటకకు సరైన ఆదేశాలు జారీ చేసేలా సిడబ్ల్యుఎంఎను ఆదేశించాలని తమిళనాడు ప్రభుత్వం కోర్టును కోరింది. ఇందుకు సంబంధించి ముందుగా 26.954 టిఎంసిల నీటిని తక్షణమే విడుదల చేయాలని కోరింది. అలాగే ప్రతి పది రోజులకు ఒకసారి కర్ణాటక రిజర్వాయర్లలోని నీటి ప్రవాహాలను పర్యవేక్షించాల్సిందిగా సిడబ్ల్యుఎంఎను ఆదేశించాలని కూడా కోరింది. అలాగే బిల్లిగుండులుకు నెల/రోజువారీ నీటి విడుదలకు కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. వరదల కారణంగా రిజర్వాయర్లలోకి బాగా నీటి ప్రవాహం వచ్చిన కొద్ది సందర్భాలు మినహా కావేరీ ట్రిబ్యునల్‌ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం ప్రతీసారీ ఉల్లంఘిస్తూనే వస్తోందని తమిళనాడు పేర్కొంది. సిడబ్ల్యుఆర్‌‌సి/సిడబ్ల్యుఎంఎ జోక్యం చేసుకున్నప్పటికీ బిల్లిగుండులు వద్ద జులై 29 నుండి ఆగస్టు 2 మధ్య కాలంలో మొత్తం ప్రవాహం 158 క్యూసెక్కులు నుండి 530 క్యూసెక్కుల మధ్యనే వుంటోందని తమిళనాడు వాదించింది. ఇది చూస్తుంటే కావాలనే కర్ణాటక ప్రభుత్వం ఆ ఆదేశాలను పాటించడం లేదని స్పష్టమవుతోందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్